ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించే లీగ్. వేలంలోకి వస్తే చాలు కోట్లకు కోట్లు పలికే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో కొందరి ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. గత ప్రదర్శన ఆధారంగా వీరిపై పలు ఫ్రాంచైజీలు డబ్బుల వర్షం కురిపించాయి. అందులో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ (రూ.15.25 కోట్లు) నిలిచాడు.
ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో అర్ధ శతకాలతో రాణించాడు. దాంతో ఇషాన్ కిషన్ పై పెట్టిన ధర ముంబై జట్టుకు గిట్టుబాటు అయ్యేలానే కనిపించింది. కానీ.. తర్వాతే అతడి ఆట గాడి తప్పింది. చివరి ఐదు మ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై 81 పరుగులతో అజేయంగా నిలిచిన కిషన్.. లక్నోపై 54 పరుగులు చేశాడు.