2015లో ఆల్‌రౌండర్ (Allrounder)గా ముంబై తరఫున ఐపీఎల్ (IPL)లో అరంగేట్రం చేసిన హార్దిక్... ఆ వెంటనే టీమిండియాకు కూడా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత జరిగిన వేలంలోనే అన్న కృనాల్‌ను కూడా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి 2021 ఐపీఎల్ వరకు కూడా ఈ సోదర ద్వయం ముంబై జట్టుకు కీలక ఆటగాళ్లుగా ఉంటూ వస్తున్నారు.