[caption id="attachment_1107272" align="alignnone" width="1600"] కేఎల్ రాహుల్ ఓపెనర్ గా, ఫినిషర్ గా రెండు బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడు. సహజంగా ఓపెనింగ్ చేసే రాహుల్... అవసరం బట్టి బ్యాటింగ్ లో లోయర్ ఆర్డర్ లో వచ్చి సూపర్ ఫినిషింగ్ ను ఇవ్వగలడు. ఐపీఎల్ లో రాహుల్ కు ఘనమైన రికార్డే ఉంది. 94 మ్యాచ్ ల్లో 3273 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉండగా... మరో 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
[caption id="attachment_1100114" align="alignnone" width="1600"] ఇంత సక్సెస్ ఫుల్ ప్లేయర్ ఒక బౌలర్ కు వణికిపోతున్నాడు. అతడి పేరు వింటే చాలు గజగజ వణికిపోతున్నాడు. ఇతర బౌలర్లలో ధాటిగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు సాధిస్తోన్న రాహుల్... ఆ బౌలర్ బంతులను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. పరుగులు సాధించలేక తంటాలు పడుతున్నాడు.
రషీద్ ఖాన్ (Rashid khan)... అధికారం కోసం ఎప్పుడూ యుద్ధాలు జరిగే అఫ్గానిస్తాన్ లో పుట్టి... క్రికెట్ కెరీర్ ను ఎంచుకొని అనతి కాలంలోనే టాప్ బౌలర్ గా ఎదిగాడు. 2017లో జరిగిన వేలంలో రషీద్ ఖాన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయడంతో అతడి రాత ఒక్కసారిగా మారిపోయింది. అనతికాలంలోనే ఐపీఎల్ లో టాప్ ప్లేయర్ గా మారిపోయాడు.
కేఎల్ రాహుల్ ను భయపెడుతున్నది రషీద్ ఖానే. టి20 ఫార్మాట్ లో ముఖ్యంగా ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ కు కొరకు రాని కొయ్యగా రషీద్ తయారయ్యడు. వీరిద్దరు తలపడిన ప్రతిసారీ కూడా రషీద్ ఖాన్ నే విజయం వరిస్తుంది. రషీద్ వేసే లెగ్ బ్రేక్ లతో పాటు గూగ్లీలను అర్థం చేసుకోలేని కేఎల్ రాహుల్ అతడికి ఊరికే దొరికి పోతున్నాడు.
టి20 ఫార్మాట్ (అంతర్జాతీయం, ఐపీఎల్ కలుపుకుని)లో కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు రషీద్ ఖాన్ బౌలింగ్ లో 30 బంతులను ఆడాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అంటే స్ట్రయిక్ రేట్ కేవలం 60 మాత్రమే. ఇందులో 14 బంతులు డాట్ బాల్స్ ఉండటం విశేషం. రషీద్ ఖాన్ ఏకంగా రాహుల్ ను మూడు సార్లు అవుట్ చేశాడు. దీన్ని బట్టే తెలుస్తుంది రషీద్ ఖాన్ బౌలింగ్ అంటే రాహుల్ కు ఎంత భయమో అని.