వీరిద్దరూ కూడా తమ జట్ల తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా ఫినిషర్ రోల్ కు న్యాయం చేస్తున్నారు. దినేశ్ కార్తీక్ 13 మ్యాచ్ ల్లో 192 స్ట్రయిక్ రేట్ తో 285 పరుగులు చేశాడు. పలుమార్లు సూపర్ బ్యాటింగ్ తో జట్టుకు విజయాలను అందించాడు. ఈ సీజన్ లో కార్తీక్ యావరేజ్ 57 కావడం విశేషం. అంటే దినేశ్ కార్తీక్ ఏకంగా 8 సార్లు నాటౌట్ గా నిలిచాడని అర్థం.
[caption id="attachment_1268988" align="alignnone" width="1600"] ఇక లివింగ్ స్టోన్ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. 12 మ్యాచ్ ల్లో 181 స్ట్రయిక్ రేట్ తో 385 పరుగులు చేశాడు. యావరేజ్ 35. మూడు వికెట్లు కూడా ఖాతాలో వేసుకున్నాడు. కార్తీక్ లాగే లివింగ్ స్టోన్ కూడా పంజాబ్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
[caption id="attachment_175764" align="alignnone" width="875"] వీరితో పాటు మరో డాషింగ్ ఆల్ రౌండర్ కూడా తన ఫినిషర్ పాత్రకు పూర్తి న్యాయం చేయగలుగుతున్నాడు. అతడే కేకేఆర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు ఆడిన రస్సెల్ 182 స్ట్రయిక్ రేట్ తో 330 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 17 వికెట్లు కూడా తీశాడు. అయితే ఇతడి ప్రదర్శన చాలా సార్లు నిరుపయోగంగానే మిగిలాయి. ఇతర ప్లేయర్స్ ఆడకపోవడంతో రస్సెల్ ఆడినా కూడా కేకేఆర్ ఓటమి పక్షానే నిలిచింది.