[caption id="attachment_1265996" align="alignnone" width="1600"] తాజాగా ఇటువంటి సంఘటనే లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) బౌలర్ కృష్ణప్ప గౌతమ్ (Krishnappa Goutham) విషయంలో చోటు చేసుకుంది. కోట్లు పలికినపుడేమో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇతడికి రాకపోగా... ఇప్పుడేమో అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. (PC:TWITTER)
దేశవాళీ టోర్నీల్లో కృష్ణప్ప గౌతమ్ అద్భుతంగా రాణించడంతో 2021 సీజన్ కు ముందు జరిగిన వేలంలో అతడిని రూ. 9.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) సొంతం చేసుకుంది. ఇక 2018 నుంచి 2020 మధ్య కృష్ణప్ప గౌతమ్ రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)కు ఆడాడు. అప్పుడు అతడిని రాజస్తాన్ టీం రూ. 6.20 కోట్లకు సొంతం చేసుకుంది. (PC: TWITTER)
[caption id="attachment_1266000" align="alignnone" width="1080"] అయితే 2018 నుంచి 2020 మధ్య పెద్దగా రాణించకపోవడంతో కృష్ణప్ప గౌతమ్ ను రాజస్తాన్ టీం రిలీజ్ చేసింది. దాంతో అతడు 2021లో జరిగిన మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ లోకి వచ్చాడు. అయితే ఇతడిని సొంతం చేసుకోవడం కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్ కింగ్స్ (Punjab Kings), చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. ఫైనల్ గా చెన్నై రూ. 9.25 కోట్లకు సొంతం చేసుకుంది. దాంతో అతడు అత్యధిక ధర పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అవతరించాడు. (PC: TWITTER)
[caption id="attachment_1266004" align="alignnone" width="2048"] అయితే ఎవరూ ఊహించని విధంగా సీజన్ లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోనూ కృష్ణప్ప గౌతమ్ ను చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులోకి తీసుకోలేదు. రూ. 9.25 కోట్ల ప్లేయర్ అయినా కృష్ణప్ప గౌతమ్ బెంచ్ కే పరిమితమయ్యాడు . అయితే ఒకే ఒక్కసారి సబ్ స్టిట్యూట్ గా మైదానంలోకి వచ్చిన అతడు ఒక క్యాచ్ ను జారవిడిచాడు. (PC: TWITTER)
[caption id="attachment_1266008" align="alignnone" width="1200"] అనంతరం మెగా వేలంలోకి రాగా... ఈసారి మాత్రం ఇతడిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో కృష్ణప్ప గౌతమ్ కేవలం రూ. 90 లక్షల ధర మాత్రమే పలికాడు. అంటే గత ధరలో దాదాపు 90 శాతాన్ని అతడు కోల్పోయాడు. లక్నో ఇతడిని ఆ మొత్తానికి సొంతం చేసుకుంది. (PC: TWITTER)
[caption id="attachment_1266010" align="alignnone" width="4096"] అయితే 2022 సీజన్ లో మాత్రం కృష్ణప్ప గౌతమ్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక వికెట్ సాధించిన అతడు... రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయాడు. ఒకే ఓవర్ లో దేవదత్ పడిక్కల్... వాన్ డర్ డుస్సెన్ వికెట్లను తీశాడు. ఇక కృనాల్ పాండ్యా గనుక హెట్ మైర్ క్యాచ్ పట్టి ఉంటే ఆ మ్యాచ్ లో మూడు వికెట్లు సాధించేవాడు. అయితే కృనాల్ పాండ్యా క్యాచ్ జారవిడవడంతో అది సాకారం కాలేదు. (PC: TWITTER)