గతేడాది జూలై నెలలో ఇంగ్లండ్ తో టీమిండియా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఆఖరి టెస్టు మ్యాచ్ సందర్బంగా భారత ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో చివరి మ్యాచ్ వాయిదా పడింది. ఆ మ్యాచ్ ను ఈ ఏడాది నిర్వహించేందుకు అటు ఇంగ్లండ్, ఇటు భారత క్రికెట్ బోర్డులు అంగీకరించిన సంగతి తెలిసిందే.