" అత్యంత ఘన చరిత్ర కలిగిన కేకేఆర్ జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన టీమ్ ఓనర్స్, మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. టీమ్ లక్ష్యాన్ని సాధించగలమనే ఆత్మవిశ్వాసం నాకుంది. భారత క్రికెట్లో కోల్‌కతా, ఈడెన్ గార్డెన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని అలానే కొనసాగించేందుకు నా సాయశక్తులా కృషి చేస్తాను. నా జట్టు, అభిమానులు తలెత్తుకునేలా కష్టపడుతాను " అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.