IPL 2022 : 6 బంతులు 4 వికెట్లు.. ఐపీఎల్ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును నమోదు చేసిన కేకేఆర్ ఆల్ రౌండర్
IPL 2022 : 6 బంతులు 4 వికెట్లు.. ఐపీఎల్ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును నమోదు చేసిన కేకేఆర్ ఆల్ రౌండర్
IPL 2022 : ఇక రాజస్తాన్ రాయల్స్ ( Rajasthan Royals) ఓపెనర్ జాస్ బట్లర్ అయితే సగం సీజన్ పూర్తయ్యే సరికి క్రిస్ గేల్ పేరిట 11 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న అత్యధిక పరుగుల రికార్డును చెరిపేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రికార్డుల మోత మోగుతూనే ఉంది. మొన్నటికి మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా నాలుగు వికెట్లు తీసి కొత్త చరిత్ర సృష్టించాడు. (PC: TWITTER)
2/ 6
ఇక రాజస్తాన్ రాయల్స్ ( Rajasthan Royals) ఓపెనర్ జాస్ బట్లర్ అయితే సగం సీజన్ పూర్తయ్యే సరికి క్రిస్ గేల్ పేరిట 11 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న అత్యధిక పరుగుల రికార్డును చెరిపేశాడు.
3/ 6
ఇదే దూకుడులో తాజాగా విండీస్ ప్లేయర్, కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఐపీఎల్ లో కొత్త చరిత్రను లిఖించాడు. ఫ్యూచర్ లో ఎవరూ అందుకోలేని రికార్డును నెలకొల్పాడు.
4/ 6
[caption id="attachment_169996" align="alignnone" width="875"] గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరిగిన మ్యాచ్ లో రస్సెల్ ఈ ఘనతను అందుకున్నాడు. మ్యాచ్ లో కేవలం ఒక్క ఓవర్ ను మాత్రమే వేసిన అతడు అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు.
[/caption]
5/ 6
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ను వేయానికి వచ్చిన రస్సెల్ ఆ ఓవర్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసి నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
6/ 6
గతంలో కేకేఆర్ బౌలర్ లక్ష్మీ రతన్ శుక్లా ఒక ఓవర్ లో మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2019లో రాజస్తాన్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ ఒక ఓవర్ వేసి మూడు వికెట్లు సాధించాడు.