ప్రస్తుత ఐపీఎల్ (IPL 2022) సీజన్లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను 62 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్‌కు టిక్కెట్‌ను దక్కించుకుంది. తొలిసారి లీగ్‌లో ఆడుతున్న ఈ జట్టు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తన తడాఖా చూపిస్తోంది. (PC- Twitter/IPL)
గుజరాత్ జట్టు అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది. దీంతో.. ఆ జట్టు ముందుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. లక్నోపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి లీగ్ ను ఘనంగా ప్రారంభించింది. 3 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ మళ్లీ లక్నోను ఓడించి ప్లేఆఫ్‌కు టికెట్ పొందింది. అయితే.. గుజరాత్ విజయాల్లో ఈ ఐదు ప్రధాన అస్త్రాలు కీ రోల్ ప్లే చేశాయ్. (PTI)
గుజరాత్ జట్టుకు శుభ్‌మన్ గిల్ పెద్ద బలం. అతను ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ శుభ్‌మన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 63 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. గుజరాత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ నిలిచాడు. ప్రస్తుత సీజన్ లో 12 మ్యాచ్‌లలో 137.14 స్ట్రైక్ రేట్‌తో 384 పరుగులు చేశాడు. (PTI)
గుజరాత్ వైస్ కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.. ఈ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 15 వికెట్లు తీశాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా రషీద్ తన మాయజాలంతో అద్భుతాలు చేస్తున్నాడు. బ్యాటింగ్ లో కూడా మెరుస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరుకు 72 పరుగులు చేశాడు. (PTI)
లీగ్‌లో కొత్త జట్టు గుజరాత్‌ను విజయవంతంగా నడిపించడంలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సక్సెస్ అయ్యాడు. తన టీమ్‌లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సమానంగా తన మాట వింటారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హార్దిక్ జట్టును అద్భుతంగా నడిపించాడు. అతను ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీల సాయంతో 344 పరుగులు చేశాడు. అలాగే.. అవసరమైనప్పుడు బౌలింగ్ లో కూడా మెరుస్తున్నాడు. (AFP)
గుజరాత్ విజయాల్లో అనుభవజ్ఞుడైన పేసర్ మహమ్మద్ షమీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. తన పేస్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. షమీ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లలో మొత్తం 16 వికెట్లు తీశాడు. ఎకానమీ రేటు 7.87. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ప్రత్యర్ధి జట్లను ఒత్తిడిలోకి నెడుతున్నాడు. (Twitter/Gujarat Titans)
గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా జట్టుకు అద్భుతమైన గైడెన్స్ అందించాడు. సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమని అభిప్రాయపడ్డారు. కానీ, అందరి అంచనాల్ని తలకిందులు చేసింది నెహ్రా - పాండ్యా జోడి. ఆశిష్ నెహ్రా స్వయంగా 17 టెస్టులు, 120 ODIలు మరియు 27 T20 ఇంటర్నేషనల్స్ ఆడిన గొప్ప బౌలర్. అతని అనుభవం గుజరాత్ జట్టు విజయాల్లో ఎంతగానో ఉపయోగపడింది. (Twitter/Gujarat Titans)