ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్‌కు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. లక్నోకు ఇది తొలి ఐపీఎల్ సీజన్. అతను లక్నో తరఫున అత్యధిక పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయ్. కానీ.. అతని జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇలా ఐదేళ్ల పాటు జట్టులో టాప్ స్కోరర్ గా ఉన్నప్పటికీ.. అతని జట్లు మాత్రం కప్పును నెగ్గలేకపోతున్నాయ్.