అయితే సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో డీలా పడింది. జడేజా కెప్టెన్ గా పూర్తిగా విఫలమయ్యాడు. అదే సమయంలో జడేజా సారథిగా ఉన్నా చాలా సార్లు ధోనినే ఫీల్డ్ ను సెట్ చేస్తూ బౌలింగ్ మార్పులు చేస్తూ జడేజాను ఢమ్మీ కెప్టెన్ ను చేశాడు. ఇక సగం సీజన్ పూర్తయ్యాక అకస్మాత్తుగా జడేజా తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో ధోని మరోసారి కెప్టెన్ గా మారాడు.
కొన్ని మ్యాచ్ ల తర్వాత జడేజా గాయంతో ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. అనంతరం జరిగిన కొన్ని సంఘటనలు జడేజా, చెన్నై మధ్య చెడిందని చెప్పకనే చెబుతున్నాయి. గాయంతో తప్పుకున్న జడేజాను సోషల్ మీడియాలో చెన్నై జట్టు అన్ ఫాలో చెయ్యగా.. ఆ తర్వాత జడేజా కూడా చెన్నై జట్టును అన్ ఫాలో చేశాడు.