IPL 2022 IPL VIRAL NEWS DO YOU KNOW INDIAN STAR COUPLE VIRAT KOHLI ANUSHKA SHARMA COMBINED NET WORTH SJN
Virushka Net Worth: అమ్మ బాబోయ్.. అంత మొత్తమా? విరుష్క జంట ఆస్తి విలువ ఎంతో తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
IPL 2022 viral news: టీమిండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ క్వీన్ అనుష్క శర్మ (Anushka Sharma) విరుష్క జంటగా భారత్ లో సూపర్ పాపులర్. ప్రస్తుతం ఇండియాలో ఈ జంట స్టార్ కపుల్ హోదాను ఎంజాయ్ చేస్తుంది. వీరిద్దరి సంపద ఎంతో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే చదవేసేయండి మరీ..
ఇండియా (India)లో అత్యంత పాపులర్ అయిన జంట ’విరుష్క (Virushka)‘. విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) వీరిద్దరు కూడా భారత దేశంలో సూపర్ స్టార్స్. ఒకరేమో సినిమా రంగంలో రాణిస్తుంటే... మరొకరు క్రికెట్ కింగ్.
2/ 9
2013 నుంచి డేటింగ్ లో ఉన్న కోహ్లీ, అనుష్క 2017లో ఒకరి చేయి మరొకరు పట్టుకుని ఏడడుగులు వేసి ఒకటయ్యారు. వీరికి 2021 జనవరి 11న పండంటి ఆడ శిశువు కూడా జన్మించింది. ఆ పాపకు వమిక అని నామకరణం కూడా చేశారు.
3/ 9
విరాట్ కోహ్లీ క్రికెట్ తో బిజీగా ఉంటే... అనుష్క శర్మ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. ఇండియాలోనే వారి వారి రంగాల్లో బిగ్ స్టార్స్ అయిన వీరిద్దరి నికర సంపద (Net worth) విలువ ఎంత ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
4/ 9
విరాట్ కోహ్లీ సంపద దాదాపు రూ. 840 కోట్లు ఉంటుంది. 2020తో పోలిస్తే ఇది కాస్త తగ్గినప్పటికీ... బ్రాండ్ వ్యాల్యూలో ఇండియాలో ఇప్పటికి కూడా విరాట్ కోహ్లీనే నంబర్ వన్ గా ఉన్నాడు. క్రికెట్, ఇతర యాడ్స్ ద్వారా విరాట్ కోహ్లీ నెల సంపాదన దాదాపు రూ. 4 కోట్లు. అంటే ఏడాదికి రూ. 48 కోట్లు అన్నమాట.
5/ 9
ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే... ఈమె నికర సంపద విలువ విరాట్ కోహ్లీతో పోలీస్తే తక్కువే. అనుష్క శర్మ నికర సంపద రూ. 255 కోట్లుగా ఉంటుంది. ఈమె నెల సంపాదన దాదాపు రూ. కోటి.
6/ 9
వీరిద్దరి సంపద కలిపితే మాత్రం దాదాపు రూ. 1100 కోట్లకు పైమాటే. ఏంటీ షాక్ అయ్యారా? 2020లో అయితే వీరిద్దరి నెట్ వర్త్ దాదాపు 1200 కోట్లకు పైనే ఉండేది. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు బీసీసీఐ గొడవల వంటి వాటితో అతడి నెట్ వర్తపై ప్రభావం చూపింది.
7/ 9
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ద్వారా ఏడాదికి రూ. 15 కోట్లను ఆర్జిస్తున్నాడు. ఇక అనేక చోట్ల ఇన్వెస్ట్ మెంట్స్ కూడా చేశాడు. ప్రముఖ స్పోర్టింగ్ బ్రాండ్ పుమాకు కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు.
8/ 9
ఇక విరుష్క జంట ముంబై లో ఉంటున్న ఫ్లాట్ ధర గురించి తెలిస్తే మన కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఆరేబియా సముద్రం పక్కన ఉన్న ఓంకార్1973 కాంప్లెక్స్ లోని ’సి‘ టవర్ లో వీరు నివాసం ఉంటున్నారు. 35వ ఫ్లోర్ లో వీరు తీసుకున్న ఫ్లాట్ విలువ దాదాపు రూ. 34 కోట్లు.
9/ 9
విరాట్ కోహ్లీ దగ్గర విలాసవంతమైన కార్లకు కూడా కొదవలేదు. మొత్తం రూ. 9 కోట్లు విలువ చేసే ఆరు కార్లు అతడి దగ్గర ఉండగా... అందులో బెంట్లీ ఫ్లైయింగ్ స్పుర్, లాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, ఆడి క్యూ8, ఆడి ఆర్8 వీ10 మోడల్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.