[caption id="attachment_1240678" align="alignnone" width="1200"] ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు సన్ రైజర్స్ (sunrisers hyderabad) మాజీ పేసర్ బాసిల్ థాంపి. 2018 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహించిన థాంపి... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore)తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలోనే పరమ చెత్త ఫిగర్స్ ను నమోదు చేశాడు. 2018 మే 17న బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్ల స్పెల్ లో అతడు 70 పరుగులు సమర్పించుకున్నాడు.
[caption id="attachment_1240686" align="alignnone" width="1200"] ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు అఫ్గానిస్తాన్ (Afghanistan) స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్. 2019 ఐపీఎల్ సీజన్ లో ముజీబ్ అప్పటి కింగ్స్ ఎలెవన్ (kings xi punjab) జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో జరిగిన మ్యాచ్ లో ముజీబ్ నాలుగు ఓవర్లలో ఏకంగా 66 పరుగులు సమర్పించుకున్నాడు. తాను వేసిన ఓ ఓవర్లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో హైదరాబాద్ టీం 212 పరుగులు చేసి 45 పరుగుల తేడాతో పంజాబ్ పై గెలుపొందింది.
[caption id="attachment_1109476" align="alignnone" width="2048"] ఈ జాబితాలో మూడో స్థానంలో భారత పేసర్ ఇషాంత్ శర్మ (Ishant sharma) ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజన్ లో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings)తో జరిగిన మ్యాచ్ లో ఇషాంత్ శర్మ ఏకంగా 66 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 223 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ టీం 77 పరుగుల తేడాతో ఓడింది.
[caption id="attachment_757806" align="alignnone" width="806"] 2013 ఐపీఎల్ సీజన్ లో ఉమేశ్ యాదవ్ తన ఐపీఎల్ లోనే చెత్త బౌలింగ్ ప్రదర్శనను చేశాడు. ఆ సీజన్ లో అప్పటి డేర్ డెవిల్స్ (delhi daredevils) తరఫున బరిలోకి దిగిన ఉమేశ్ యాదవ్... రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లలో 65 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి రెండు ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చిన ఉమేశ్... తన చివరి రెండు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో బెంగళూరు 4 పరుగుల తేడాతో గెలిచింది.
పరమ చెత్త బౌలర్ల జాబితాలో సందీప్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. 2014 ఐపీఎల్ సీజన్ లో అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రాతినిధ్యం వహించిన సందీప్ శర్మ... ఈ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సందీప్ శర్మ 65 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ లో ఒక వికెట్ తీసినా... పరుగుల పరంగా మాత్రం చెత్త ప్రదర్శన చేశాడు. తాను దారాళంగా పరుగులు సమర్పించుకున్నా బ్యాటర్ల చలువతో మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందింది.