[caption id="attachment_1242392" align="alignnone" width="1600"] ఇండియన్ అన్ క్యాప్ట్ ప్లేయర్స్ జాబితాలో ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో చూడాల్సిన ప్లేయర్ రాజ్ అంగద్ బవ. కు చెందిన రాజ్ బవ... అండర్ 19 ప్రపంచకప్ లో పాల్గొన్న భారత జట్టులో సభ్యుడు. రాజ్ బవ తండ్రి టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురువు కూడా కావడం విశేషం. అండర్ 19 ప్రపంచకప్ లో టీమిండియా గెలవడంలో బవ కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాట్ తో ఇటు బంతితో మెరిశాడు. అందుకే గత నెలలో జరిగిన మెగా వేలంలో ఇతడి కోసం ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు కింగ్స్ (Punjab kings) రూ. 2 కోట్లకు ఇతడిని సొంతం చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ లో ఈ యంగ్ ఆల్ రౌండర్ కు మంచి డిమాండ్ ఉంది. భారీ షాట్లు ఆడటంతో పాటు వికెట్లు తీయడంలో రాజ్ బవ దిట్ట. అన్ని అనుకున్నట్లే జరిగితే మరో యువరాజ్ సింగ్ లా రాజ్ బవ మారే అవకాశం ఉంది.
రెండు నెలల క్రితం వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో యశ్ ధుల్ (Yash Dhull) నాయకత్వంలోని యంగ్ టీమిండియా విజేతగా నిలిచింది. అందుకే ఈ బాయ్ ని ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. వేలంలో ఇతడు రూ. 50 లక్షలే పలికిన ఇతడికి ఐపీఎల్ లో మంచి డిమాండ్ ఉంది. ఐపీఎల్ వేలం తర్వాత జరిగిన రంజీ మ్యాచ్ ల్లో వరుస పెట్టి సెంచరీలు సాధించాడు. ఇక కెప్టెన్ గా అండర్ 19ను లీడ్ చేయడం ఇతడి మరో బలం. ఐపీఎల్ 15వ సీజన్ లో తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని రాణిస్తే... మరో విరాట్ కోహ్లీ (Virat kohli)లా యశ్ ధుల్ అవ్వొచ్చు.
[caption id="attachment_1242398" align="alignnone" width="1600"] ఐపీఎల్ 15వ సీజన్ లో డిమాండ్ ఉన్న మరో ఇండియన్ కుర్ర క్రికెటర్ రాజవర్ధన్ సింగ్ హంగార్గేఖర్. ఇతడు కూడా అండర్ 19 ప్రపంచకప్ లో పాల్గొన్న టీమిండియాలో సభ్యుడు. కొత్త బంతితో మాయ చేయగలడు. ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) వేలంలో రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. గాయంతో జట్టుకు దూరమైన దీపక్ చహర్ స్థానాన్ని ఇతడు భర్తీ చేసే అవకాశం ఉంది.
[caption id="attachment_1242400" align="alignnone" width="1600"] టీమిండియాకు ఆడకపోయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (royal challengers banglore) ప్లేయర్ షాబాజ్ అహ్మద్ కు డిమాండ్ బాగానే ఉంది. గతేడాది జరిగిన ఐపీఎల్ లో షాబాజ్ అహ్మద్ అద్భుతంగా రాణించాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ఓడిపోయే మ్యాచ్ లో బెంగళూరును గెలిపించాడు. అందుకే వేలంలో ఇతడిని మరోసారి బెంగళూరు టీం సొంతం చేసుకుంది. ఇతడి కోసం ఏకంగా రూ. 2.4 కోట్లను వెచ్చించింది.