[caption id="attachment_1200842" align="alignnone" width="1600"] గత సీజన్ రికార్డులను.. అప్పటి ఫామ్ ను దృష్టిలో ఉంచుకొని ఫ్రాంచైజీలు వేలం పాడతాయి. దాంతో కొందరు ఊహకందని భారీ ధరకు అమ్ముడైతే.. మరికొందరేమో అమ్ముడేపోరు. ఆ లెక్కన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలం చూస్తే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఇషాన్ కిషన్ కోసం ఏకంగా రూ. 15.25 కోట్లు వెచ్చింది. ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ ఇతడే కావడం విశేషం. ఇక దీపక్ చహర్ ను రూ. 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అయితే దీపక్ గాయంతో సీజన్ మొత్తానికి దూరం కాగా.. ఇషాన్ దారుణంగా విఫలమవుతున్నాడు.