సారథులను మార్చడం పంజాబ్ కింగ్స్ (Punjab kings) జట్టుకు ఒంటి మీద డ్రస్సును మార్చినంత సులభం. ఇప్పటి వరకు 14 సీజన్లలో పాల్గొన్న ఆ జట్టు ఏకంగా 12 సార్లు కెప్టెన్సీ మార్పులను చేసింది. ఐపీఎల్ లో ఒక టీంకు అత్యధిక కెప్టెన్లు పనిచేసిన టీంగా పంజాబ్ నిలిచింది. తాజాగా 15వ సీజన్ కు మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడంతో పంజాబ్ కెప్టెన్ల సంఖ్య 13కు చేరింది. యువరాజ్ సింగ్, సంగక్కర, జయవర్ధనే, గిల్ క్రిస్ట్, హస్సీ, బెయిలీ, సెహ్వాగ్, మిల్లర్, మురళీ విజయ్, మ్యాక్స్ వెల్, అశ్విన్, రాహుల్ తాజాగా మయాంక్ అగర్వాల్ పంజాబ్ కు కెప్టెన్లుగా పనిచేశారు.
[caption id="attachment_1240412" align="alignnone" width="1600"] పంజాబ్ తో పోటీ పడి మీరీ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) టీం తమ కెప్టెన్లను మార్చింది. 14 సీజన్లలో ఏకంగా 13 సార్లు కెప్టెన్లను మార్చింది. ఢిల్లీకి కెప్టెన్లుగా పనిచేసిన వారిలో సెహ్వాగ్, గంభీర్, కార్తీక్, హోప్స్, జయవర్దనే, రాస్ టేలర్, వార్నర్, కెవిన్ పీటర్సన్, జేపీ డ్యూమినీ, జహీర్ ఖాన్, కురుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ లు ఉన్నారు. గతేడాది నుంచి రిషభ్ పంత్ ఢిల్లీ సారథిగా ఉంటున్నాడు.
కెప్టెన్లను మార్చిన జాబితాలో పంజాబ్, ఢిల్లీ ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers hyderabad) ఉంది. 14 సీజన్లలో ఏకంగా 8 మంది ఆ జట్టుకు కెప్టెన్లుగా పనిచేశారు. తొలి సీజన్ లో శ్రీలంక వెటరన్ కుమార సంగక్కార కెప్టెన్ గా పనిచేశాడు. అనంతరం కామెరూన్ వైట్, శిఖర్ ధావన్, స్యామీ పనిచేశారు. ఆ తర్వాత వార్నర్ 2015 నుంచి 2021 (తొలి అంచె మ్యాచ్ లకు మాత్రమే) వరకు కెప్టెన్ గా ఉన్నాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ ఉదంతం వల్ల 2018 సీజన్ లో వార్నర్ పాల్గొనలేదు. దాంతో అతడి స్థానంలో కేన్ విలియమ్సన్ సారథిగా పనిచేశాడు. మధ్యలో కొన్ని మ్యాచ్ లకు భువనేశ్వర్ కుమార్, మనీశ్ పాండే లు కెప్టెన్లుగా వ్యవహరించారు. 2022 సీజన్ లో మాత్రం కేన్ విలియమ్సన్ సారథిగా ఉండబోతున్నాడు. (PC: SRH)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore)కు ఇప్పటి వరకు కెప్టెన్లుగా ఆరుగురు పనిచేశారు. ఆరంభ సీజన్ లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ గా ఉంటే అనంతరం జరిగిన సీజన్ కు అనిల్ కుంబ్లే సారథిగా వ్యవహరించాడు. మధ్యలో కొన్ని మ్యాచ్ లకు కెవిన్ పీటర్సన్ సారథిగా ఉన్నాడు. ఇక 2011, 2012 సీజన్లలో డానియెల్ వెటోరి సారథిగా పనిచేశాడు. 2011 నుంచి 2021 వరకు విరాట్ కోహ్లీ () సారథిగా ఉన్నాడు. మధ్యలో విరాట్ కోహ్లీ గాయంతో కొన్ని మ్యాచ్ లకు దూరమైతే అతడి స్థానంలో 2017 సీజన్లో మూడు మ్యాచ్ లకు షేన్ వాట్సన్ సారథిగా ఉన్నాడు. తాజాగా కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పడంతో టీం కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ ను ఎంపిక చేసింది. ముంబై ఇండియన్స్ కూడా తమ సారథులను ఏడుసార్లు మార్చింది.