అభిమానులను ఆటగాళ్లు తమ ఆటతో ఎంతగా అలరిస్తారో... వారు ఆటను వర్ణిస్తూ టీవీల్లో మనకు వినిపించే కామెంట్రీ కూడా మనల్ని అంతే అలరిస్తుంది. కామెంట్రీ లేకుండా మ్యాచ్ ను మనం చూడలేం కూడా. ఒక ప్లేయర్ కొట్టిన ఫోర్ ను కామెంటేటర్ వర్ణిస్తుంటే... చూసే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ఉదాహరణకు 2007 టి20 ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు తీసుకుంటే యువరాజ్ ఎంత అద్భుతంగా సిక్సర్లు బాదాడో... అంతే అద్భుతంగా కామెంటరీ బాక్స్ నుంచి తన వ్యాఖ్యానాన్ని రవిశాస్త్రి వినిపించాడు. సింపుల్ గా చెప్పాలంటే... సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలానో... క్రికెట్ కు కామెంట్రీ అలా.