గతేడాది భారత్, యూఏఈ వేదికల్లో ఐపీఎల్ రెండు అంచెలుగా జరిగింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers banglore) తరఫున బరిలోకి దిగిన హర్షల్ పటేల్... తన బౌలింగ్ తో మాయ చేశాడు. డెత్ ఓవర్స్ లో వైవిధ్యమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్ల పాలిట సింహ స్వప్నంలా మారడు. ఈ క్రమంలో అతడు 15 మ్యాచ్ ల్లో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. (PC: BCCI)
2021 ఐపీఎల్ ప్రదర్శనతో హర్షల్ పటేల్ అనతి కాలంలోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇటీవల వెస్టిండీస్ ,శ్రీలంక జట్లతో జరిగిన టి20 సిరీస్ ల్లో భారత్ తరఫున ఆడాడు. ఆడటమే కాదు అద్భుతంగా రాణించాడు కూడా. ఐపీఎల్ లో ఏ విధంగా అయితే వేరియేషన్స్ తో బంతులు వేస్తూ సక్సెస్ అయ్యాడో... అదే విధంగా శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ ఏడాది ఆఖర్లో జరిగే టి20 ప్రపంచకప్ లో హర్షల్ పటేల్ టీమిండియాకు ప్రధాన అస్త్రంగా ఉండున్నాడు.
ఇంత సక్సెస్ ఫుల్ హర్షల్ పటేల్ కూడా ఓ చెత్త రికార్డును కలిగి ఉన్నాడు. అది కూడా గత ఏడాదే నమోదు చేశాడు. అదేంటంటే ఒక ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డును తన పేరిట గతేడాది లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా హర్షల్ నిలిచాడు. 2021 ఐపీఎల్ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హర్షల్ పటేల్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు.
20 ఓవర్ ను హర్షల్ పటేల్ వేయగా క్రీజులో ఉన్న జడేజా... వరుసగా 6, 6, 6, నోబాల్, 6, 2, 6, 4 బాదాడు. దాంతో 2007 టి20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇచ్చిన 36 పరుగుల కంటే కూడా ఓ పరుగును ఎక్కువగానే హర్షల్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో జడేజా కేవలం 28 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తొలి మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చిన హర్షల్ పటేల్... నాలుగో ఓవర్ అనంతరం 4-0-51-3గా నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్, ముంబై vs రాజస్థాన్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, కెఎల్ రాహుల్, బెంగళూరు vs లైవ్ స్కోరు, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్" width="875" height="583" /> 2011లో జరిగిన ఐపీఎల్ సీజన్ లో క్రిస్ గేల్ కూడా ఒకే ఓవర్లో 37 పరుగులు సాధించాడు. అప్పుడు కొచ్చి టస్కర్స్ కు చెందిన ప్రశాంత్ పరమేశ్వరన్ బలైయ్యాడు. అతడు తన ఓవర్లలో ఏకంగా 37 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాతి జాబితాలో పర్వీందర్ అవానా (33 పరుగులు), రవి బొపార (33 పరుగులు), రాహుల్ శర్మ (31 పరుగులు), ఆండ్రూ సైమండ్స్ (30 పరుగులు) ఉన్నారు. ఇందులో మూడు సార్లు బౌలర్లు క్రిస్ గేల్ బ్యాట్ కే బలవ్వడం విశేషం.