[caption id="attachment_827290" align="alignnone" width="1200"] ఇన్నేళ్లు గడిచినా ఐపీఎల్ లో సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును ఎవరు కూడా కొట్టలేకపోతున్నారు. సురేశ్ రైనా (Suresh Raina), రోహిత్ శర్మ (Rohit Sharma), గౌతమ్ గంభీర్ (gautam gambhir) మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)లు చేరువగా వచ్చినా.. సచిన్ రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయారు.
[caption id="attachment_847018" align="alignnone" width="1200"] ఐపీఎల్ లో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా సచిన్ రికార్డు నెలకొల్పాడు. 1,000 పరుగులు చేయడానికి సచిన్ కేవలం 31 ఇన్నింగ్స్ లు మాత్రమే తీసుకున్నాడు. తాజాగా పడిక్కల్ ఈ రికార్డును బ్రేక్ చేసేలా కనిపించాడు.
[caption id="attachment_1273558" align="alignnone" width="1080"] కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రెండో పరుగును పూర్తి చేసిన పడిక్కల్ తన కెరీర్ లో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అతడు ఈ మైలురాయిని అందుకోవడానికి 35 ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్, ధోని, గంభీర్ లను అధిగమించిన పడిక్కల్ సచిన్ ను మాత్రం టచ్ చేయలేకపోయాడు. (PC: TWITTER)