హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, సన్ రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2022 షెడ్యూల్, కేన్ విలియమ్సన్, ఐపీఎల్, ఐపీఎల్ 2022, ఐపీఎల్ న్యూస్, ఐపీఎల్ 2022 న్యూస్, రిషభ్ పంత్, ఐపీఎల్ 2022 షెడ్యూల్, ఐపీఎల్ వార్తలు, ఐపీఎల్ జట్లు, ఐపీఎల్ టీమ్స్, మహిళల వన్డే ప్రపంచకప్," width="1600" height="1600" /> ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలు జట్టు సారథి కేన్ విలియమ్సన్ ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందనేది కాదనలేని సత్యం. ఒకరకంగా చెప్పాలంటే జట్టుకు వెన్నెముక లాంటోడు విలియమ్సన్. పరిస్థితికి తగ్గట్లు ఆడటంలో విలియమ్సన్ కు మరెవరూ సాటి రారు. 2018లో ఆరెంజ్ క్యాప్ ను కూడా అందుకున్న విలియమ్సన్ ఇప్పుడు జట్టుకు ప్రధాన బలం. అయితే అతడి గాయం జట్టును కలవరపెడుతోంది. విలియమ్సన్ గత కొన్ని నెలలుగా మోచేతి గాయంతో బాధ పడుతున్నాడు. అందుకే గత కొంతకాలంగా అతడు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ ఆరంభం నాటికి అతడు పూర్తి ఫిట్ నెస్ సాధించకపోతే అది జట్టుకు మంచిది కాదు.
[caption id="attachment_838980" align="alignnone" width="1200"] గత నెలలో జరిగిన మెగా వేలంలో వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ప్రత్యేక ఆకర్షణలా నిలిచాడు. ఇతడి కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడగా... దాదాపు 10.75 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. పూరన్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. భారత్ తో జరిగిన సిరీస్ లో కావొచ్చు... అనంతరం కరీబియన్ లీగ్ ట్రినిడాట్ టి10 లీగ్ లో కావొచ్చు.. పూరన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఐపీఎల్ లో కూడా పూరన్ అలానే చెలరేగితే... సన్ రైజర్స్ మ్యాచ్ విన్నర్ గా పూనర్ అవతరించడం ఖాయం. పూరన్ పై ప్రస్తుతం విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇవి అతడిపై పాజిటివ్ గా పనిచేస్తే మంచిదే... లేదంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తాడని భువనేశ్వర్ కుమార్ కు మంచి పేరుంది. గత కొన్ని ఎడిషన్లుగా భువీ సన్ రైజర్స్ జట్టులో భాగంగా ఉంటూ వస్తున్నాడు. అయితే భువనేశ్వర్ కుమార్ ఫిట్ నెస్ పైనే అందరికీ ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ లో ప్రతి జట్టు కూడా వరుస పెట్టి మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాంతో అతడు తన శరీరాన్ని ఐపీఎల్ కు అనుగుణంగా ఎలా మార్చుకుంటాడనేది తెలియాలి. గతంలో కూడా ఒక మూడు మ్యాచ్ లు ఆడిన తర్వాత నాలుగో మ్యాచ్ ఆడుతూ తొడ కండరాల గాయం బారిన పడి సీజన్ కే దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో భువీ ఫిట్ నెస్ పై సందేహాలు ఉన్నాయి. భువీ పూర్తి ఫిట్ నెస్ తో ఉంటే మాత్రం ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు.
[caption id="attachment_1246650" align="alignnone" width="1600"] వేలంలో చాలా తక్కువ ధరకే సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్ రమ్ ను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. పరిస్థితికి తగ్గట్లు ఆడటంలో మార్క్ రమ్ కు మంచి పేరుంది. తన వికెట్ ను కాపాడుకుంటూ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగడంలో మార్క్ రమ్ స్టయిలే వేరు. అయితే అతడికి భారత పిచ్ లపై రికార్డు పెద్దగా లేదు. ఇది కాస్త కలవరపెట్టే అంశమే.
[caption id="attachment_1246654" align="alignnone" width="1600"] ఈ జాబితాలో జమ్మూ కశ్మీర్ కు చెందిన ఉమ్రన్ మాలిక్ కూడా ఉన్నాడు. మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ రీటెయిన్ చేసుకున్న ముగ్గరు ప్లేయర్స్ లో ఉమ్రన్ మాలిక్ కూడా ఒకడు. గత సీజన్ లో కేవలం మూడు మ్యాచ్ లే ఆడిన అతడు రెండు వికెట్లు తీశాడు. అయితే బంతిని గంటకు 150 ప్లస్ కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. ఇదే ఇప్పుడు అతడిని ప్రత్యేకంగా చేస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో కూడా ఉమ్రన్ మాలిక్ సత్తా చాటాడు. బౌన్సర్లతో హడలెత్తించాడు. అయితే ఉమ్రన్ మాలిక్ ను వేధిస్తోన్న అంశం పరుగులు ఇవ్వడం. దారాళంగా పరుగులు ఇస్తున్నాడు. దీన్ని గనుక అతడు కంట్రోల్ చేయగలిగితే ప్రత్యర్థి బ్యాటర్లకు తిప్పలు తప్పవు.
వీరితో పాటు కరీబియన్ ప్లేయర్ రొమారియో షెపర్డ్... సౌతాఫ్రికాకు చెందిన మార్కో జాన్సెన్ కూడా సన్ రైజర్స్ కు చాలా ముఖ్యం. రొమారియోకు ఆరంభంలోనే తుది జట్టులో చోటు దక్కక పోవచ్చు. సీజన్ గుడుస్తున్న కొద్ది అతడికి చాన్స్ లు రావొచ్చు. వీరితో పాటు రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మలు ఈ సీజన్ లో కీలకం కానున్నారు. ముఖ్యంగా సమద్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు ఈ సీజన్ లో ఆడలేకపోతే మాత్రం వచ్చే సీజన్ లో అతడి ప్లేస్ గల్లంతు కావడం ఖాయం.