ఐపీఎల్-2022(IPL 2022) కోసం సర్వం సిద్ధమవుతోంది. ఈ క్యాష్ రీచ్ లీగ్ కోసం బీసీసీఐ పనులను వేగవంతం చేసింది. ఈ ధనాధన్ లీగ్ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. అంతకంటే ముందు ఫిబ్రవరి 12, 13న మెగావేలం జరగనుంది. ఈసారి రెండు కొత్త జట్లు టోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఏ జట్లు ఎవరిని రిటైన్ చేసుకున్నాయి, ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత నగదు మిగిలి ఉందో చూద్దాం