మరికొన్ని గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలం (Mega auction) ఆరంభం కానుంది. రేపు, ఎల్లుండి బెంగళూరు (bangalore) వేదికగా జరిగే ఈ వేలంలో ఆటగాళ్లపై దాదాపు రూ. 515.5 కోట్లను ఖర్చు చేసేందుకు 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ (IPL Governing Body) ఒక్కో జట్టుకు రూ. 90 కోట్లను కేటాయించింది. ఈ లెక్కన ఐపీఎల్ 2022లో ఆటగాళ్ల కోసం 10 టీమ్లు కలిసి రూ.900 కోట్లను ఖర్చే చేయనున్నాయన్నమాట.
అయితే రీటెయిన్ పాలసీ ద్వారా 8 జట్లు... కొత్తగా వచ్చిన అహ్మదాబాద్, లక్నో టీమ్లు ముగ్గురు చొప్పున ప్లేయర్లను ఎంపిక చేసుకోవడంతో మొత్తం 10 జట్లు ఇప్పటికే రూ. 384.5 కోట్లను ఖర్చు చేశాయి. దాంతో ఈ శని, ఆదివారాల్లో జరిగే వేలంలో మిగిలిన రూ. 515.5 కోట్లను ఫ్రాంచైజీలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు దగ్గర ఎంత డబ్బు మిగిలి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.