[caption id="attachment_855798" align="alignnone" width="1050"] 2021లో అద్భుత ప్రదర్శన తర్వాత కూడా ఆర్సీబీ జట్టు అతడిని వదులుకుంది. అయితే వేలంలో రూ. 10.75 కోట్లకు మళ్లీ సొంతం చేసుకుంది. తాజా సీజన్ లో హర్షల్ పటేల్ 7 మ్యాచ్ ల్లో 9 వికెట్లు తీశాడు. ఇక స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ యూట్యూబ్ షో బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్ లో పాల్గొన్న హర్షల్ నమ్మలేని నిజాలను బయటపెట్టాడు.
2018 వేలంలో తనకు జరిగిన నమ్మక ద్రోహం గురించి అతడు వెల్లడించాడు. ’2018 ఐపీఎల్ సీజన్ కు ముందు జరిగిన వేలంలో మొదట నా కోసం ఎవరూ కూడా వేలం పాడలేదు. వాస్తవానికి నేను ఎవరో ఒకరు పాడతారనే ఆశతో ఆ సమయంలో ఉన్నా.. కానీ, ఒక్కరు కూడా నా కోసం వేలాన్ని ఆరంభించలేదు. అప్పుడు.. అంతకుముందు జరిగిన కొన్ని సంఘటనలు నా మదిలో మెదిలాయి. వేలానికి ముందు పలు ఫ్రాంచైజీలకు చెందిన కొందరు వ్యక్తులు నాతో మాట్లాడారు. నా కోసం వేలం పాడతామని వారు నాకు చెప్పారు. కానీ, వేలం రోజు వారంతా సైలెంట్ గా ఉన్నారు. ఆ సమయంలో నేను నమ్మకద్రోహానికి, మోసానికి గురైయ్యాననే భావన కలిగింది‘ అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. అయితే ఆ ఫ్రాంచైజీల పేర్లను మాత్రం హర్షల్ పటేల్ బయట పెట్టలేదు. (Twitter)
2018 వేలంలో ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) రూ. 20 లక్షల బేస్ ప్రైజ్ కు హర్షల్ పటేల్ ను సొంతం చేసుకుంది. అయితే అతడికి ఢిల్లీ తో ఉన్న 2018, 19, 20 సీజన్లలో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో 2021 సీజన్ ముందు వరకు ట్రాన్స్ ఫర్ క్లాజ్ ద్వారా హర్షల్ పటేల్ ను ఆర్సీబీ జట్టుకు బదిలీ చేసింది. ఇక అక్కడి నుంచి హర్షల్ పటేల్ కెరీర్ మొత్తం మారిపోయింది. (Photo Credit : Twitter)
[caption id="attachment_1252798" align="alignnone" width="448"] హర్షల్ పటేల్ 2012 నుంచి 2017 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు. 2018 నుంచి 2020 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్ లో హర్షల్ పటేల్ ఇప్పటి వరకు 70 మ్యాచ్ ల్లో 87 వికెట్లు తీశాడు. ఇటీవలె ఇతడి సోదరి మరణించిన సంగతి తెలిసిందే.