IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2021 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బౌలర్ హర్షల్ పటేల్ (Harshal Patel) ఒక సంచలనం. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అతడు ఆ సీజన్ లో ఏకంగా 32 వికెట్లతో సంచలన ప్రదర్శన చేసి పర్పుల్ క్యాప్ ను కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో అతడిని ఈ సీజన్ కోసం ఫిబ్రవరి నెలలో జరిగిన మెగా వేలంలో రూ. 10.75 కోట్లకు బెంగళూరు జట్టు మళ్లీ సొంతం చేసుకుంది. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా హర్షల్ పటేల్ చక్కగా రాణిస్తున్నాడు. (PC : IPL)
2021లో అద్భుత ప్రదర్శన తర్వాత కూడా ఆర్సీబీ జట్టు అతడిని వదులుకుంది. అయితే వేలంలో రూ. 10.75 కోట్లకు మళ్లీ సొంతం చేసుకుంది. తాజా సీజన్ లో హర్షల్ పటేల్ 8 మ్యాచ్ ల్లో 10 వికెట్లు తీశాడు. అయితే స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ యూట్యూబ్ షో బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్ లో పాల్గొన్న హర్షల్ తన జట్టుపైనే షాకింగ్ కామెంట్స్ చేశాడు. (Twitter)
ఐపీఎల్ 2017 సీజన్ లో ఆర్సీబీ తనతో వ్యవహరించిన తీరు గురించి వివరించాడు. ’ 2016 సీజన్ లో నేను పెద్దగా మ్యాచ్ లు ఆడలేకపోయా. కేవలం 5 మ్యాచ్ ల్లోనే బరిలోకి దిగాను. ఇక 2017 సీజన్ లోనూ నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఒక రోజు అప్పటి కోచ్ డానిల్ వెటోరి నన్ను తన వద్దకు పిలిపించుకున్నాడు. ఆ సమయంలో అతడు నాతో.. ఈ సీజన్ లో నీకు కేవలం నాలుగు లేదా ఐదు మ్యాచ్ ల్లోనే ఆడే అవకాశం వస్తుంది. హోటల్ రూమ్, ఫ్లయిట్ టికెట్స్, రోజువారి అలవెన్సులు ఇలా నీ కోసం టీం ఓనర్లు చాలా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మేం ఒక నిర్ణయానికి వచ్చాం. అదే నిన్ను ఇంటికి పంపాలని‘ అని వెటోరీ నాతో అన్నాడని హర్షల్ పేర్కొన్నాడు. (Photo Credit : Twitter)
[caption id="attachment_850786" align="alignnone" width="1050"] అతడి మాటలకు తాను షాక్ అయ్యా అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. చేసేదేమి లేక తాను ఇంటి దారి పట్టానని కూడా హర్షల్ పేర్కొన్నాడు. అయితే ఆ సీజన్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరలేదు. దాంతో చివరి మ్యాచ్ లకు తనకు అవకాశం కల్పించాలని వెటోరికి మెస్సేజ్ ఇచ్చినట్లు హర్షల్ పేర్కొన్నాడు.