ఇక, గుజరాత్ విజయంలో స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) నాలుగు వికెట్లతో కీలకపాత్ర పోషించాడు. రషీద్ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ 82 పరుగులకే కుప్పకూలింది.ఇక, ఈ మ్యాచులో బ్యాటర్ల పని పట్టిన రషీద్ ఖాన్ పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు.
ఇక రషీద్.. ఈ మ్యాచ్ ద్వారా తన ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. 3.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. అంతకుముందు 2020 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై(3 వికెట్లు/ 7 పరుగులు), పంజాబ్ కింగ్స్‌పై(3 వికెట్లు/12 పరుగులు) చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటివరకు 15 వికెట్లు తీశాడు.
ఇక, టీ20 క్రికెట్ చరిత్రలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 450 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచి.. దిగ్గజాలు డ్వేన్ బ్రావో(వెస్టిండీస్), ఇమ్రాన్ తాహీర్(దక్షిణాఫ్రికా) సరసన చోటు సంపాందించాడు. ఇలా, గుజరాత్ విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. వికెట్లు తీయడంతో పాటు.. బ్యాటర్లు వేగంగా పరుగులు చేయకుండా కంట్రోల్ చేస్తున్నాడు ఈ అఫ్గన్ మేజిషియన్.