IPL 2022 GUJARAT TITANS STAR PLAYER DAVID MILLER CHILL AND RECHARGE IN MALDIVES AFTER SUPER SHOW IN THIS SEASON SRD
IND vs SA : ఐపీఎల్ లో విధ్వంసం సృష్టించాడు.. ఇప్పుడు ఎంచక్కా మాల్దీవుల్లో చేపలు పడుతున్నాడు..!
IND vs SA : భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (India vs South Africa)కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సిరీస్‌లో తొలి టీ20 జూన్ 9న జరగనుండగా.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (India vs South Africa)కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సిరీస్‌లో తొలి టీ20 జూన్ 9న జరగనుండగా.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు.
2/ 6
ఆ స్టార్ ప్లేయర్ ఎవరో కాదు. ఐపీఎల్ 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన డేవిడ్ మిల్లర్. మిల్లర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో మాల్దీవుల నుంచి రెండు ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఫోటోల్లో కిర్రాక్ లుక్ లో కన్పించాడు.
3/ 6
'గత 8 వారాలను గుర్తు చేసుకుంటున్నాను. ఇది నాకు అద్భుతమైన అనుభవం, నేను ఎప్పటికీ మరచిపోలేను. మాల్దీవులకు రావడం వల్ల విశ్రాంతి తీసుకోవడానికి మరియు రీఛార్జ్ చేసుకోవడానికి నాకు అవకాశం లభించింది.' అని మిల్లర్ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు.
4/ 6
ఐపీఎల్ 2022లో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో డేవిడ్ మిల్లర్ (David Miller) అదరగొట్టేశాడు. 16 మ్యాచ్ ల్లో 481 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
5/ 6
క్వాలిఫయర్ 1లో 68* (38), ఫైనల్లో 32* (19) పరుగులు చేసి గుజరాత్ ను చాంపియన్ గా నిలబెట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 142. సగటు 69.
6/ 6
ఐపీఎల్ వేలంలో మిల్లర్‌ను రూ.3 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది. IPL తర్వాత, మిల్లర్ ఇప్పుడు భారత్‌తో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌ను ఆడనున్నాడు. IPL 2021 సీజన్ ఫెయిలైనా మిల్లర్.. ఇప్పుడు గుజరాత్‌కు స్టార్ ప్లేయర్ గా మారాడు.