హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 2015లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ద్వారా క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అరంగేట్రం చేశాడు. అతి తక్కువ కాలంలోనే పవర్ హిట్టింగ్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుని టీమిండియా (Team India) తలుపు కూడా తట్టాడు. దాదాపు ఏడేళ్ల పాటు ముంబై జట్టుకు ఆడిన హార్దిక్ పాండ్యా... ఈ సీజన్ తో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కు కెప్టెన్ గా మారిపోయాడు.
' కెప్టెన్‌గా ఉండే వ్యక్తి చాలా హుందాగా వ్యవహరించడం చాలా అవసరం. ఒక్కో కెప్టెన్‌కి ఒక్కో రకమైన స్టైల్, టెంపర్మెంట్ ఉంటాయి. ధోని మిస్టర్ కూల్.. చాలా నెమ్మదస్తుడు. అయితే కోహ్లీ మాత్రం అగ్రెసివ్. రోహిత్ పరిస్థితులకు తగ్గట్టుగా మ్యాచ్‌ని నడిపిస్తాడు. కాబట్టి హార్ధిక్ పాండ్యా మైండ్‌సెట్‌ని అర్థం చేసుకోవడం నాకు రాకెట్ సైన్స్ ఏమీ కాదు..' అంటూ వ్యాఖ్యానించాడు.