అయితే, లేటెస్ట్ గా ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన బీసీసీఐ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. ఆటగాళ్ల బయో బబూల్, మ్యాచ్ ల నిర్వహాణ, మైదనాల తో పాటు ప్రేక్షకుల అనుమతికి సంబంధించి కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ చర్చలు జరిపింది.
అంతే కాకుండా కరోనా పరిస్థితులను బట్టి ప్రేక్షకుల సామర్థ్యం పెంచుతామని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం, బీసీసీఐ తెలిపాయి. ఇక, మార్చి 14, 15 తేదీల నుంచే ఐపీఎల్ – 2022 కోసం ప్రాక్టిస్ ప్రారంభం కానుంది. మెగా లీగ్‌లో పాల్గొనే 10 జట్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా ఐదు గ్రౌండ్స్‌ను గుర్తించారు.