ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) కు ఈ ఐపీఎల్(IPL) టోర్నీ చాలా కీలకం. ఈ టోర్నీలో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచింది. బయో-బబుల్‌ను పరిగణనలోకి తీసుకుంటే, రాబోయే ప్రపంచ కప్‌కు 23 మందిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అయితే, ఐపీఎల్ ప్రదర్శన ద్వారా రీ ఎంట్రీకి సై అంటున్నారు ఈ ఐదుగురు ఆటగాళ్లు. (AP)
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మునుపటిలా చెలరేగుతున్నాడు. సన్‌రైజర్స్‌పై హార్దిక్ హాఫ్ సెంచరీ సాధించాడు. అలాగే, బౌలింగ్ లో కూడా మంచి రిథమ్ చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటాను కూడా పూర్తి చేస్తాడు. హార్దిక్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. ఆస్ట్రేలియాలో హార్ధిక్ లాంటి ప్లేయర్ టీమిండియాకు ఎంతో అవసరం. (PTI)