IPL 2022 సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఈ సీజన్ లో చాలా మ్యాచ్లు ఉత్కంఠ రేపుతున్నాయి. చాలా మంది ఆటగాళ్లు బ్యాట్, బంతితో రాణించి దుమ్మురేపుతున్నారు. అయితే.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు మాత్రం నిరాశపర్చారు. ఈ ఆటగాళ్లపై ఆయా జట్లు విశ్వాసం ఉంచి.. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే.. దానికి తగ్గ ప్రదర్శన మాత్రం వీరు చేయలేకపోయారు.
ఇక, ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంతవరకు బోణి కొట్టలేదు. ఇంకా తొలి విజయం కోసం ఆ జట్టు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. వరుసగా 6 మ్యాచ్ ల్లో ఓడిన ముంబై ఆటతీరుకు ప్రధాన కారణం కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. ఈ సీజన్లో రోహిత్ 19 సగటుతో 114 పరుగులు చేశాడు. రూ.16 కోట్లతో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను రిటైన్ చేసుకుంది ముంబై.