నెలన్నర రోజులుగా క్రికెట్ ఫ్యాన్స్ కు మజా అందిస్తోన్న ఐపీఎల్ 2022 (IPL 2022) లీగ్ స్టేజీ పూర్తి కావొచ్చింది. మరి కొద్ది రోజుల్లో లీగ్ స్టేజీకి తెరపడునుంది. లీగ్ స్టేజీ ముగిసిన వెంటనే.. ఫ్లే ఆఫ్స్, ఫైనల్ జరగనున్నాయ్. 29వ తేదీన ఫైనల్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. మే 29 ఫైనల్ ముగిసిన తర్వాత, దక్షిణాఫ్రికా జట్టు భారతదేశంలో (India vs South Africa) పర్యటిస్తుంది.
ఈ పర్యటనలో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఉంటుంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది. 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ.
మోహ్సిన్ ఖాన్ (Mohsin Khan): తన తొలి సీజన్ ఐపీఎల్ లో మోహ్సిన్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. లక్నో తరఫున ఆడుతున్న మోహ్సిన్ 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ముఖ్యంగా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని బౌలింగ్ లో పరుగులు చేయడానికి స్టార్ బ్యాటర్లు కూడా నానా తంటాలు పడుతున్నారు.
శిఖర్ ధావన్ (Shikhar Dhawan): ఐపీఎల్ 2022లో శిఖర్ ధావన్ బ్యాట్ మాట్లాడుతోంది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ధావన్ 11 మ్యాచ్‌ల్లో 42.33 సగటుతో 381 పరుగులు చేశాడు. ధావన్ గత ఏడాది శ్రీలంకపై తన చివరి T20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. కానీ అతని ప్రస్తుత ఫామ్‌ను బట్టి, అతని టీమిండియాలోకి తిరిగి వచ్చే ఛాన్సుంది.
హార్దిక్ పాండ్యా (Hardik Pandya): ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను 10 మ్యాచ్‌ల్లో 41.62 సగటుతో 333 పరుగులు చేశాడు. T20 ప్రపంచ కప్ 2021 తర్వాత హార్దిక్ పాండ్యాను జట్టు నుండి తొలగించారు,. కానీ ఇప్పుడు ఈ ప్రదర్శనతో సెలక్టర్లు అతనికి టీమిండియాలో చోటు కల్పించే ఛాన్సుంది.