క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా చూస్తున్న సమయం రానే వచ్చింది. క్రికెట్ కుంభమేళా ఐపీఎల్ 2022 (IPL 2022)కి కౌంట్ డౌన్ షూరు అయింది. మరో కొద్ది గంటల్లో క్రికెట్ పండగ ప్రారంభం కాబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఫస్ట్ ధమాకాలో చెన్నై, కోల్ కతా జట్లు తలపడనున్నాయ్. ఇక, ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి... రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే, రవీంద్ర జడేజా బీ అలర్ట్ గా ఉండాలి. ఐపీఎల్ లో చెన్నై జట్టు అంటే చాలు ఈ ఐదుగురు ఆటగాళ్లు విధ్వంసం సృష్టిస్తారు.