కీరన్ పొలార్డ్ (Kieron Pollard) : ఈ సీజన్లో రూ.6 కోట్లతో ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న కీరన్ పొలార్డ్ నిరాశపరిచాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచుల్లో కేవలం 144 పరుగులు మాత్రమే చేశాడు పొలార్డ్. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. యావరేజ్ 14.40 . స్ట్రైక్ రేట్ అయితే 106. ఒకప్పుడు 200కి స్టైక్ రేట్ తో బాదే పొలార్డ్ ని చూస్తే జాలేస్తేంది. దీంతో.. తన ప్రదర్శన చూస్తుంటే పొలార్డ్ కు ఇదే చివరి ఐపీఎల్ అనిపిస్తోంది.
విజయ్ శంకర్ (Vijay Shankar) : ఇక, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. తన త్రీడీ ఆడని ఎప్పుడూ బయటకు తీయని ఈ ఆటగాడు ఈ సీజన్ లో కూడా తన చెత్త ఫామ్ ను కంటిన్యూ చేశాడు. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ బౌలింగ్ లోనూ, బౌలింగ్ లోనూ విఫలమయ్యాడు. గుజరాత్ తరఫున ఆడుతున్న విజయ్ శంకర్ 54.2 స్ట్రైక్ రేట్‌తో 4 మ్యాచ్‌ల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా శంకర్ పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో, త్రీడీ అన్నని ఇక ఐపీఎల్ లో చూడటం కష్టమే అంటున్నారు ఫ్యాన్స్.
మనీశ్ పాండే (Manish Pandey) : లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న మనీష్ పాండే 6 మ్యాచ్‌ల్లో 14.67 సగటుతో, 80 స్ట్రైక్ రేట్‌తో 88 పరుగులు చేశాడు. మనీష్ పాండే ఇప్పటి వరకు ఐపీఎల్లో ముంబై, ఆర్సీబీ, పుణె వారియర్స్, కేకేఆర్, హైదరాబాద్, లక్నో తరఫున ఆడాడు. కానీ, తన చెత్త ఆటతో ప్రతిసారీ నిరాశపరుస్తున్నాడు.
జైదేవ్ ఉనాద్కత్ (Jaydev Unadakat) : ముంబై ఇండియన్స్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ జైదేవ్ ఉనద్కత్ కూడా ఈ సీజన్లో కష్టపడుతున్నాడు. అతను 5 మ్యాచ్‌ల్లో 190 పరుగులు ఇచ్చి 6 వికెట్లు మాత్రమే తీశాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 32 పరుగులకు 2 వికెట్లు. ఈ ప్రదర్శన చూస్తే జయదేవ్ ఐపీఎల్ తదుపరి సీజన్లో ఆడడం కష్టమే అన్పిస్తోంది.
అజింక్య రహానే (Ajinkya Rahane) : కేకేఆర్ ఓపెనర్ అజింక్య రహానే ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోయాడు. అతను 6 మ్యాచ్‌లలో 17.50 సగటుతో మరియు 100.96 స్ట్రైక్ రేట్‌తో కేవలం 105 పరుగులు చేశాడు. ఈ ఏడాది రహానే బ్యాటింగ్ నుంచి ఒక్క అర్ధ సెంచరీ కూడా రాలేదు. దీంతో.. నెక్ట్స్ సీజన్ లో రహానే చూడటం కష్టమేనని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.