అనిల్ కుంబ్లే : ఈ జాబితాలో తొలి స్థానంలో భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే ఉన్నాడు. 2009లో డెక్కన్ చార్జర్స్ తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ బౌలర్ కుంబ్లే కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. దాంతో డీసీ 144 పరుగులకు ఆలౌటైంది. అయితే అనంతరం ఆర్సీబీ ఈ పరుగులను చేజ్ చేయలేక ఓడిపోయింది. దాంతో కుంబ్లే సూపర్ ఫిగర్స్ ఓటమి వైపు నిలిచింది.
[caption id="attachment_1104558" align="alignnone" width="1600"] అశ్విన్ : ఇక రెండో స్థానంలోనూ స్పిన్నరే ఉండటం విశేషం. 2011లో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా 205 పరుగుల ఛేజింగ్ లో ఆర్సీబీ కుప్పకూలి రన్నరప్ గా నిలిచింది.
యూసఫ్ పఠాన్ : ఈ జాబితాలో మూడో స్థానంలో రాజస్తాన్ రాయల్స్ అప్పటి ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ ఉన్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ లో యూసఫ్ పఠాన్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ లోనూ చెలరేగిన పఠాన్ రాజస్తాన్ కు ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. (PC : TWITTER)
మిచెల్ జాన్సన్ : 2017లో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్ ఫైట్ లో ముంబై ఇండియన్స్ ను విజేతగా నిలపడంలో ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై కేవలం 129 పరుగులు మాత్రమే చేసింది. దాంతో రైజింగ్ పుణే జెయింట్స్ విక్టరీ ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే తన పేస్ తో మ్యాజిక్ చేసిన జాన్సన్.. ముంబై కి 9 పరుగుల తేడాతో విజయాన్ని ఖాయం చేశాడు.
బుమ్రా : ఈ జాబితాలో ఐదో స్థానంలో బుమ్రా ఉన్నాడు. 2019లో చెన్నైతో జరిగిన ఫైనల్లో 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసిన బుమ్రా ముంబైకి అద్భుత విజయాన్ని అందించాడు. 150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నైకి వాట్సన్, డు ప్లెసిస్ అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు. అయితే బుమ్రా వికెట్లు తీసి ముంబైని నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్ గా నిలిపాడు.