టి20 లీగుల్లో సిక్సర్లు బాదే ప్లేయర్ కు డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే వీరు రెండు మూడు ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తారు కాబట్టి. ఇక, సిక్సర్లు బాదడంలో విండీస్ క్రికెటర్లు ముందుంటారు. ఇక, ఐపీఎల్ లో ఇలా తక్కువ బంతుల వ్యవధిలో ఎక్కువ సిక్సర్లు బాదిన వారిలో విండీస్ హిట్టర్, కోల్‌కతా ఆటగాడు రసెల్ టాప్‌లో ఉన్నాడు. ఇతడు సగటున ఐపీఎల్ (IPL)లో ఎదుర్కొన్న ప్రతి 7 బంతులకో సిక్సర్ బాదాడు. మరి టాప్-10లో ఉన్న ఆటగాళ్లెవరో చూద్దాం.
ఐపీఎల్ (IPL) అంటేనే బోలెడంత కిక్కు. బంతి బంతికి మారే ఆధిపత్యం.. స్టేడియం పై కప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గిరాటేసే బంతులు.. ఇలా అభిమానులకు కావాల్సినంత మజా అందిస్తోంది ఈ క్యాష్ రిచ్ లీగ్. ఇక, ఐపీఎల్ 15 వ సీజన్ కూడా తగ్గేదే లే అంటోంది. ప్రతి మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగుతుండటంతో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.
ఐపీఎల్లో కనీసం 500 బంతులు ఎదుర్కొన్న వారిలో ఇలా తక్కువ బంతుల వ్యవధిలో సిక్సర్లు బాదిన వారిలో టాప్-10లో భారత బ్యాటర్ ఒక హార్దిక్ పాండ్య మాత్రమే. పాండ్య.. సగటున ప్రతి 10 బంతులకు ఒకదాన్ని స్టాండ్స్‌లోకి పంపించాడు. ఇతడు మొత్తం 87 ఇన్నింగ్స్‌ల్లో 1540 పరుగులతో ఈ లిస్ట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. స్టైక్ రేట్ 150కి పైనే.