మార్చి 26వ తేదీ శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుందని తెలిపారు బ్రిజేష్ పటేల్. రెండు కొత్త జట్లు లక్నో(Lucknow) సూపర్‌జెయింట్స్, (Gujarat) టైటాన్స్ ఈసారి ఐపీఎల్ టీమ్స్ జాబితాలో చేర్చబడినందని వెల్లడించారు. ఈసారి ఐపీఎల్లో మొత్తం 74 మ్యాచ్‌లు ఉంటాయి. వాటిలో 70 మ్యాచ్‌లు ముంబైలోని(Mumbai) వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియంతో పాటు నవీ ముంబైలోని DY పాటిల్ మైదానం, పూణేలోని గహుంజే స్టేడియంలో జరుగుతాయి.
అయితే, ఐపీఎల్ షెడ్యూల్ పై ఫ్రాంచైజీలు గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోనే 55 మ్యాచులు జరుగుతుండటంతో పలు ఫ్రాంచైజీలు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాంఖడే స్టేడియం ముంబై ఇండియన్స్ జట్టుకు హోం గ్రాండ్ అని.. అక్కడ మ్యాచులు నిర్వహిస్తే ఆ జట్టుకే ప్రయోజనం అని ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ నాలుగు గేమ్‌లను ఆడుతుంది.ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించాలని యోచిస్తున్నామని.. అలాగే దేశంలో నిర్వహించేందుకు బీసీసీఐ కూడా సిద్ధంగా ఉందని బీసీసీఐ సెక్రటరీ జై షా గతంలోనే తెలిపారు. ఒకవేళ భారత్‌లో మ్యాచ్‌ల నిర్వహణ సాథ్యంకాకపోతే.. రెండో ప్రాధాన్యతగా దక్షిణాఫ్రికా ఉంటుందని.. కానీ ఆ అవసరం రాకపోవచ్చని అన్నారు. ఖచ్చితమైన రోజులు, పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల చేయనున్నారు.