ఐపీఎల్.. (IPL ) ఈ క్యాష్ రీచ్ లీగ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కరోనాతో అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ మలిదశ సందడి అప్పుడే మొదలైంది. ఇప్పటికే అన్ని జట్ల తమ ప్లేయర్లను యూఏఈలో జరిగే సెకండాఫ్ కు పంపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయ్. మరోవైపు.. వచ్చే ఏడాది జరిగే లీగ్ పైనే అందరి కళ్లు పడ్డాయ్.
కొత్తగా రెండు జట్లు వచ్చి చేరుతుండటం.. ఆటగాళ్లను మెగా వేలం నిర్వహించనున్న నేపథ్యంలో అప్పుడే ఈ క్యాష్ రిచ్ లీగ్ చర్చ మొదలైంది. వచ్చే ఏడాది జరిగే సీజన్ కోసం ఇప్పటి నుంచే బీసీసీఐ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.
అయితే ఆటగాళ్ల రిటైన్ పాలసీపై బోర్డు స్పష్టతనిచ్చింది. ప్రతి ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లను మాత్రమే అట్టి పెట్టుకునే చాన్స్ ఉందని తెలిపింది.ఇందులో ముగ్గురు ఇండియన్స్, ఒకరు ఫారిన్ ప్లేయర్. లేదంటే ఇద్దరు ఇండియన్స్, ఇద్దరు ఫారిన్ ప్లేయర్లను ఎంచుకోవచ్చు.
ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు బీసీసీఐ రిటైన్ పాలసీ పెద్ద తలనొప్పిగా మారనుంది. స్టార్ ప్లేయర్లను కలిగి ఉన్న ముంబై జట్టు.. తాజా రూల్‌తో అందర్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నయా రూల్‌తో ఫైవ్ టైం చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ను సైతం ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటుంది. ఈ తరం క్రికెట్లో బుమ్రా అత్యుత్తమ టీ-20 పేసర్. టీ20 ఫార్మాట్లో అతని బౌలింగ్ అసాధారణం. ఈ యార్కర్ల కింగ్ ఇప్పటికే 99 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 24.14 సగటుతో 115 వికెట్లు తీశాడు. ముంబై విజయాల్లో బుమ్రాది కీలక పాత్ర.
ఇక, ముంబై సగం బలం వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard). రోహిత్, బుమ్రా, హార్దిక్ ఒక ఎత్తు అయితే.. పోలార్డ్ ఒక్కడే మరో ఎత్తు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై ఎన్నో అద్భుత విజయాలందుకుంది. విదేశీ కోటాలో ముంబై అతన్ని కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. పైగా పొలార్డ్ ముంబై వైస్ కెప్టెన్. రోహిత్ లేని సమయంలో ఎన్నో సార్లు ముంబైకి కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతే గాక, ముంబై జట్టుని విజయతీరాలకు కూడా నడిపించాడు. దీంతో పొలార్డ్ ను ముంబై వదులకునే పరిస్థితులు కన్పించడం లేదు.
2010 నుంచి ముంబైకే ఆడుతున్న పొలార్డ్.. లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎన్నో విజయాలందించాడు. 171 ఐపీఎల్ మ్యాచ్‌లో 3191 రన్స్‌తో 63 వికెట్లు తీశాడు. కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగులతో అజేయంగా నిలిచిన పొలార్డ్.. ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు.