ఐపీఎల్ 2022 (IPL 2022 Latest Updates) సీజన్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతుండటంతో ఆటగాళ్లను రిటెన్షన్‌పై ఫ్రాంచైజీలన్నీ తర్జనభర్జన పడుతున్నాయి. ఎవరిని కొనసాగించాలో.. ఎవరిని వదిలేయాలన్న సమీకరణాల్ని లోతుగా విశ్లేషించుకుంటున్నాయి. అహ్మదాబాద్, లక్నో సిటీల పేర్లతో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనుండడంతో ఐపీఎల్ 2022 సీజన్లో 10 ఫ్రాంఛైజీలు టైటిల్ పోరులో తలబడబోతున్నాయి. దీంతో మెగా వేలంలో ఆటగాళ్ల కోసం మరింతగా పోటీ పడనున్నాయ్ ఫ్రాంచైజీలు.