[caption id="attachment_1315964" align="alignnone" width="1600"] ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఆటగాళ్లపై ఫ్రాంచైజీ జట్లు డబ్బుల వర్షం కురిపిస్తే.. ఫైనల్ పోరు మాత్రం ఫ్రాంచైజీలపై కాసుల వర్షం కురిపించనుంది. నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఐపీఎల్ 15వ సీజన్ కు ఎండ్ కార్డు పడనున్న సంగతి తెలిసిందే.
ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రేసులో బట్లర్ ను బీట్ చేయడం కష్టమే. 16 మ్యాచ్ ల్లో అతడు 824 పరుగులు సాధించాడు. ఇక పర్పుల్ క్యాప్ హోల్డర్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఆర్సీబీ బౌలర్ హసరంగ, రాజస్తాన్ స్పిన్నర్ చహల్ 26 వికెట్లు తీశారు. అయితే మెరుగైన ఎకానమీ (7.54) కారణంగా హసరంగా తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో చహల్ ఒక్క వికెట్ తీస్తే చాలు అతడికే పర్పుల్ క్యాప్ సొంతం కానుంది.