రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇవాళ రాత్రి జరిగే టైటిల్ పోరుతో ఐపీఎల్ 2022 ఎడిషన్ కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్లు టైటిల్ కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడేందుకు సై అంటున్నాయ్.
బలబలాలు చూస్తే రెండు జట్లు స్ట్రాంగ్ గా కన్పిస్తున్నాయ్. 14 ఏళ్ల తర్వాత క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచి ఫైనల్కు చేరుకుంది. IPL మొదటి సీజన్ (IPL 2008), షేన్ వార్న్ (Shane Warne) కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలుచుకుంది. ఇక రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకోవాలని రాజస్థాన్ ఉవ్విళ్లూరుతుంది.
సంజూ శాంసన్ భార్య చారులత స్పందిస్తూ.. 'ఐపీఎల్ 2022 ట్రోఫీ రేసును చూపించే ఈ యానిమేటెడ్ వీడియోను మొదటి రోజు ఐపీఎల్ ప్రెజెంటర్స్ ప్రసారం చేశారు. ఇందులో పింక్ జెర్సీ ఎందుకు మిస్సయిందో మాత్రం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి రాజస్థాన్ ఫైనల్ చేరుకుంది. అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక తన స్టోరీలో తర్వాతి పోస్టుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్కు చేరుకున్న చిత్రాన్ని కూడా ఆమె షేర్ చేసింది.
ఇక, ఈ మెగా ఫైట్ లో రాజస్థాన్ జట్టుకు జోస్ బట్లర్ కీ ప్లేయర్ అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 16 మ్యాచ్ లు ఆడిన బట్లర్ 824 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతానికి బట్లర్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా ఉన్నాడు. ఇక యశస్వీ జైశ్వాల్, కెప్టెన్ సంజూ సాంసన్, దేవదత్ పడిక్కల్, హెట్ మెయిర్, రియాన్ పరాగ్ లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ ఫుల్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది.
అటు బౌలింగ్ విభాగంలో రాజస్థాన్ అదరగొడుతోంది. రాజస్థాన్ బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ ఆరంభ ఓవర్లలో వికెట్లను తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (26) సీజన్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు. స్పిన్నర్ అదరగొడుతున్నాడు. 16 మ్యాచులు ఆడిన చాహల్ 26 వికెట్లు తీసి ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో అశ్విన్ పరుగులు నియంత్రిస్తూ ప్రత్యర్ధుల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాడు. వీరందరూ ఆల్ రౌండ్ షో చేస్తే 14 ఏళ్ల తర్వాత మరోసారి టైటిల్ చేజిక్కుంచుకుంటోంది ఆర్ఆర్ టీమ్.