అయితే బట్లర్ ప్రస్తుతం ఉన్న ఫామ్ ను చూస్తే కోహ్లీ రికార్డును బద్దలు కొట్టినా ఆశ్యర్యపోనవసరం లేదు. బట్లర్ గనుక ఆఖరి సమరంలో 150 పరుగులు చేస్తే.. ఒకే దెబ్బకు కోహ్లీకి సంబంధించిన రెండు రికార్డులు బట్లర్ ఖాతాలో చేరతాయి. అత్యధిక పరుగుల రికార్డు ఒకటైతే.. మరోదేమో సెంచరీల రికార్డు. ఒక సీజన్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ, బట్లర్ చెరో నాలుగు సెంచరీలతో సమంగా ఉన్నారు. అయితే ఫైనల్లో బట్లర్ దీన్ని పూర్తిగా తన పేరిట లిఖించుకునే అవకాశం ఉంది.