IPL 2022 Final : రాజస్తాన్ రాయల్స్ ను కాటేసేందుకు సిద్ధమైన గుజరాత్ స్టార్ ఆల్ రౌండర్.. అతడెవరంటే?
IPL 2022 Final : రాజస్తాన్ రాయల్స్ ను కాటేసేందుకు సిద్ధమైన గుజరాత్ స్టార్ ఆల్ రౌండర్.. అతడెవరంటే?
IPL 2022 Final : సీజన్ ఆసాంతం నిలకడగా ఆడిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్లు ఫైనల్ కు చేరుకోగా.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి రాత్రి ఫైనల్ పోరు జరగనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ అంతిమ సమరానికి సిద్ధమైంది. 10 జట్లతో ఆరంభమైన లీగ్.. చివరకు రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్ పోరుతో ముగియనుంది.
2/ 6
సీజన్ ఆసాంతం నిలకడగా ఆడిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్లు ఫైనల్ కు చేరుకోగా.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి రాత్రి ఫైనల్ పోరు జరగనుంది.
3/ 6
లీగ్ టేబుల్ లో గుజరాత్ టైటాన్స్ తొలి స్థానంలో నిలస్తే.. రాజస్తాన్ రాయల్స్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అదే పద్ధతిలో తొలుత గుజరాత్ ఫైనల్ కు క్వాలిఫై కాగా.. తర్వాత రాజస్తాన్ క్వాలిఫై అయ్యింది.
4/ 6
అయితే మ్యాచ్ కు ముందు గుజరాత్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ రాజస్తాన్ రాయల్స్ ను హెచ్చరించాడు. ఫైనల్లో తాను స్నేక్ షాట్లతో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.
5/ 6
ఈ సీజన్ ముందు వరకు కూడా లెగ్ స్పిన్నర్ గానే ఉన్న రషీద్ ఖాన్.. తాజా ఐపీఎల్ తో తనలో బ్యాటర్ కూడా ఉన్నాడని అందరికీ తెలియజేశాడు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స హైదరాబాద్ జట్లపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లతో అదరగొట్టాడు.
6/ 6
ఇక ఫైనల్లోనూ తాను అటు బ్యాట్ తో ఇటు బౌలింగ్ తో రాణించి గుజరాత్ కు తొలి టైటిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రషీద్ పేర్కొన్నాడు.