మరికొద్ది గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ చాంపియన్ ఎవరో తేలిపోనుంది. అయితే దానికంటే ముందు కూడా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించే అద్భుత పోరు జరగడం ఖాయం. నరేంద్ర మోదీ స్టేడియంలో వేదికగా నేటి రాత్రి గం. 8 నుంచి రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. (PC : TWITTER)
షేన్ వాట్సన్ : ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ ఉన్నాడు. 2018లో జరిగిన ఫైనల్లో వాట్సన్ కేవలం 57 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఫైనల్లో ఓ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇదే కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తో చెన్నై సన్ రైజర్స్ పై అద్బుత విజయాన్ని అందుకుని టైటిల్ ను సొంతం చేసుకుంది.
వృద్ధిమాన్ సాహా : ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్.. ఇప్పటి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా కూడా ఉన్నాడు. 2014లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్లో సాహా.. 55 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్ కతా పంజాబ్ టార్గెట్ ను ఛేదించి విజేతగా నిలిచింది. దాంతో సాహా 115 పరుగులు ఓటమివైపు నిలిచింది.
బిస్లా : ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు. మన్వీందర్ బిస్లా అంటే ఎవరూ అనేవారు కూడా ఉంటారు. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవడానికి బిస్లాలే కారణం. 2012లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 48 బంతుల్లో 89 పరుగులు చేసిన ఇతడు కోల్ కతాకు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.