ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మెగాఫైట్ కు మరికొన్ని గంటల సమయం ఉంది. ఈ సీజన్ అంతటా నిలకడగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఇక, ఫైనల్లో గుజరాత్ ఆటగాడితో రాజస్థాన్ రాయల్స్ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇక అంతే సంగతులు.
ఇక, విండీస్ హిట్టర్ షిమ్రాన్ హెట్ మేయర్ 45 బంతుల్లో 63 పరుగులు చేసినప్పటికీ.. నాలుగు సార్లు రషీద్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. రియాన్ పరాగ్ ను ఇంకా రషీద్ ఔట్ చేయలేదు. కానీ అతను కేవలం 7 బంతుల్లో మాత్రమే ఆడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు. ఇక, ఆర్. అశ్విన్ 6 బంతుల్లో 7 పరుగులు చేసి రెండుసార్లు ఔటయ్యాడు.
రషీద్ ఖాన్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఐదు T20 లీగ్ ఫైనల్స్లో ఆడాడు. ఈ ఐదు మ్యాచుల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. కానీ అతని ఎకానమీ రేటు 5.27 మాత్రమే. దీన్ని బట్టే అర్ధమవుతోంది.. రషీద్ బౌలింగ్ లో పరుగులు చేయడానికి బ్యాటర్లు ఎంతగా ఇబ్బంది పడ్డారో. ఈ లెక్కన రషీద్ ఖాన్ రాజస్థాన్ పై ఒత్తిడి పెంచితే.. మిగతా బౌలర్ల పని సులువు అవ్వడం ఖాయమంటున్నారు క్రీడా విశ్లేషకులు.