ప్రస్తుత ఐపీఎల్ (IPL 2022) సీజన్లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. అలాగే, క్వాలిఫయర్ -1 లో కూడా అదరగొట్టి ఫైనల్ లో దర్జాగా అడుగుపెట్టింది. గుజరాత్ అదిరిపోయే ప్రదర్శనకు ప్రధాన కారణం ఆల్ రౌండ్ పర్ఫామెన్స్. అయితే.. గుజరాత్ విజయాల్లో ఈ ఐదుగురు ఆటగాళ్లు కీ రోల్ ప్లే చేశారు. (PTI)
గుజరాత్ జట్టుకు అతి పెద్ద బలం హార్దిక్ పాండ్యా. లీగ్‌లో కొత్త జట్టు గుజరాత్‌ను విజయవంతంగా నడిపించడంలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సక్సెస్ అయ్యాడు. తన టీమ్‌లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సమానంగా తన మాట వింటారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హార్దిక్ జట్టును అద్భుతంగా నడిపించాడు. అతను ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచుల్లో 453 పరుగులతో బ్యాటింగ్ లో అదరగొట్టాడు. అలాగే.. అవసరమైనప్పుడు బౌలింగ్ లో కూడా మెరుస్తున్నాడు. (AFP)
గుజరాత్ విజయాల్లో అనుభవజ్ఞుడైన పేసర్ మహమ్మద్ షమీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. తన పేస్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. షమీ ఇప్పటివరకు 15 మ్యాచ్‌లలో మొత్తం 19 వికెట్లు తీశాడు. ఎకానమీ రేటు 7.87. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ప్రత్యర్ధి జట్లను ఒత్తిడిలోకి నెడుతున్నాడు. (Twitter/Gujarat Titans)