బౌలర్లు మెకాయ్, బౌల్ట్ చెరో సిక్సర్ బాదినా కూడా పరాగ్ మాత్రం ఆ విధంగా చేయలేకపోయాడు. అంతేకాకుండా బౌలర్ నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్నప్పుడు ధోని ఎలా స్ట్రయికింగ్ ను ఉంచుకుంటాడో పరాగ్ కూడా అదే విధంగా చేశాడు. కానీ ధోనిలా మాత్రం భారీ సిక్సర్లు ఆడలేకపోయాడు. దాంతో రాజస్తాన్ చివరి ఓవర్లలో పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఫలితంగా గుజరాత్ ముందు నామమాత్రమైన స్కోరును టార్గెట్ గా ఉంచగలిగింది.