ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ ప్లే ఆఫ్ రేస్ పీక్ స్టేజికి చేరుకుంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలవడానికి పోటీ తీవ్రతరం అయింది. ఇక, ఐపీఎల్లో అత్యంత బలమైన జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒకటి. ఎందుకంటే ఈ జట్టులో స్టార్ ప్లేయర్ల సంఖ్య చాలా ఎక్కువ. అయితే, కేకేఆర్ ప్రదర్శన మాత్రం ఈ సీజన్ లో నిరాశపర్చింది. 12 మ్యాచుల్లో కేవలం ఐదు మాత్రమే గెలిచి పది పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది కేకేఆర్. ఈ టీమ్‌లోని స్టార్ ప్లేయర్ల భార్యలు మరియు గర్ల్ ఫ్రెండ్స్ ఏం చేస్తారో ఓ లుక్కేద్దాం.
కరీబియన్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ జాసిమ్ లారాను వివాహం చేసుకున్నాడు. లారా ఒక ఫ్యాషన్ మోడల్ మరియు బ్లాగర్. వివిధ బ్రాండ్ల కోసం బోల్డ్ ఫోటోషూట్లు చేస్తూ లారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఫ్లోరిడాకు చెందిన లారా 2011లో రస్సెల్‌తో డేటింగ్ ప్రారంభించింది. 2014లో నిశ్చితార్థం చేసుకుని రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు.