ఐపీఎల్ 2022 సీజన్లో దినేశ్ కార్తీక్ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తున్నాడు. కెరీర్ చివరి దశలో దినేశ్ కార్తీక్ 2.oను తలపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన కార్తీక్ కాక.. మరో మెరుపు ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు.
తన దుమ్మురేపే ప్రదర్శనతో ఈ ఇద్దరికి సవాల్ విసురుతున్నాడు. మరోవైపు, ఇషాన్, రిషబ్ పంత్ లు అనుకున్నంతగా రాణించడం లేదు. రిషబ్ పంత్ ని రూ. 16 కోట్లకి ఢిల్లీ రిటైన్ చేసుకుంటే.. రూ.15.25 కోట్లకి ఇషాన్ కిషన్ ను కొనుగోలు చేసింది ముంబై. ఇప్పుడు ఈ రూ.31.25 కోట్ల ఆటగాళ్లకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు కార్తీక్ కాక.
ఇక, ధోని తర్వాత టీమిండియాకు సరైన ఫినిషర్ దొరకలేదు. కానీ, ఈ సీజన్ లో దినేశ్ కార్తీక్ విధ్వసం చూస్తుంటే అతని రూపంలో టీమిండియాకు మంచి ఫినిషర్ దొరికినట్టే అన్పిస్తోంది. అసలకే టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ పిచ్ ల్లో ఆడాలంటే అనుభవమున్న ఆటగాడు అవసరం ఎంతైనా ఉంది. దీంతో, కచ్చితంగా దినేష్ కార్తీక్ టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నారు.