ఈ సీజన్లో వార్నర్ లేట్‌గా జాయిన్ అయినప్పటికి హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. తాజాగా బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో అర్థసెంచరీ సాధించాడు. సీజన్లో వార్నర్‌కు ఇది ఐదో ఫిప్టీ కావడం విశేషం. మార్ష్(89)తో కలిసి వార్నర్(52*) కీలక సమయంలో ఢిల్లీని గెలిపించి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచాడు.
వార్నర్ 2009లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టినప్పటికి.. 400 పరుగుల మార్క్‌ను అందుకుంది 2013లోనే. ఆ సీజన్లో వార్నర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో ఎస్ఆర్హెచ్కు మారిన వార్నర్.. ఆరు సీజన్ల పాటు(మధ్యలో 2018 సీజన్లో వార్నర్ ఆడలేదు) 400కి పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు.
2021 సీజన్లోనే వార్నర్ అంతగా రాణించలేదు. ఆ తర్వాత అవమానకర రీతిలో ఎస్ఆర్హెచ్ నుంచి బయటికి వచ్చిన వార్నర్‌ను ఐపీఎల్ మెగావేలంలో రూ.6.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్లో వార్నర్ 9 మ్యాచ్‌ల్లో 427 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేసులో నిలవడం ఖాయమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.