ఢిల్లీ ఫిజియో ప్యాట్రిక్ ఫారహర్ట్, ఐపీఎల్ లో కరోనా కలకలం, టెన్షన్ లో బీసీసీఐ, ఢిల్లీ ఫిజియోకి పాజిటివ్" width="1600" height="1600" /> గత ఐపీఎల్ సీజన్ లో కరోనా ఎలాంటి దుమారం రేపిందో తెలిసిందే. పలు జట్లలోని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారినపడడంతో ఆ సీజన్ అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించి, టోర్నీ పూర్తి చేశారు. తాజా సీజన్ లోనూ కరోనా కలకలం రేగింది.
[caption id="attachment_1270596" align="alignnone" width="1600"] ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మాత్రం ఏదో ఒక రూపంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను మాత్రం వెంటాడుతూనే ఉంది. కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి ఈసారి ఐపీఎల్ మొత్తాన్ని (Maharashtra) వేదికగానే జరిపేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమైంది. అయినా కూడా ఐపీఎల్ 2022 సీజన్ ని కరోనా వెంటాడుతోంది.
[caption id="attachment_1270620" align="alignnone" width="774"] శుక్రవారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాట్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పరీక్షలో అతడికి పాజిటివ్ గా వచ్చింది. దీంతో అతన్ని వెంటనే ఐసోలేషన్కి తరలించింది టీమ్ మేనేజ్మెంట్. ప్యాట్రిక్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు.. అతడికి ఎటువంటి లక్షణాలు లేవని ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. (PC: TWITTER)
శుక్రవారం చేసిన కరోనా పరీక్షల్లో ఇతర జట్టు సభ్యులకు నెగెటివ్ రిపోర్టులు రాగా.. శనివారం మరోసారి చేసిన కోవిడ్ 19 పరీక్షలో కూడా అందరికీ నెగెటివ్ గా రిపోర్టు వచ్చింది. దాంతో ఢిల్లీ జట్టుతో పాటు బీసీసీఐ కూడా ఊపిరి పీల్చుకుంది. ప్యాట్రిక్ నుంచి కరోనా ఇతర ప్లేయర్స్ కు గానీ.. కోచింగ్ స్టాఫ్ కు గానీ సోకలేదని ఒక ప్రకటనలో పేర్కొంది. (IPL Twitter)
శనివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్ కేసు రావడంతో ఈ మ్యాచ్ జరగడంపై అనుమానాలు తలత్తాయి. అయితే తాజాగా ప్లేయర్స్ అందరికీ నెగెటివ్ రావడంతో శనివారం సాయంత్రం జరగాల్సిన మ్యాచ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా షెడ్యూల్ ప్రకారం యధాతథంగా జరుగుతుందని పేర్కొంది.